

శంఖవరం/అన్నవరం మన న్యూస్ (అపురూప్) ; 24 గంటల్లోపే నేరాన్ని శోధించి దొంగను అదుపులోనికి తీకోడమే గాకుండా చోరీ సొత్తు మొత్తాన్ని రాబట్టి స్వాధీనం చేసుకుని అన్నవరం పోలీసులు తమ విధి నిర్వహణా నిబద్ధతను మరోమారు నిరూపించు కున్నారు. హైదరాబాద్ అల్వాల్ హిల్స్ ప్లాట్ నం. 102 లో ఒకప్పటి నివాసితుడు, గుంటూరు పలకలూరు రోడ్ అవసా అపార్ట్మెంట్ ఫ్లాట్ నం. 410 లో ప్రస్తుత నివాసి బోడపాటి నాగేశ్వరరావు (9849985934) సోమవారం ఉదయం గుంటూరు నుండి తునికి వచ్చి తునిలో ఉన్న తన ఇంటి స్థలాన్ని తన స్నేహితుడు భాను ప్రకాష్ ద్వారా రూ. 20,00,000 లకు విక్రయించాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం మెత్తం సొమ్ములో రూ.10,00,000 లను నగదు గానూ, మరో రూ. 10,00,000 లకు బ్యాంకు చెక్కును తీసుకున్నాడు. ఆ నగదును తన చేతి సంచీలో ఉంచుకుని అదే రోజు ఉదయం 11.30 గంటలకు తునిలో ఏపిఎస్. ఆర్టీసీ బస్సు ఎక్కి అన్నవరం బస్ కాంప్లెక్సులో బస్సు దిగాడు. తన వద్ద ఉన్న డబ్బు సంచితో మధ్యాహ్నం 12.27 గంటలకు మరో బస్సును ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని దృష్టిని మరల్చి, పదునైన చాకుతో చేతి సంచిని కత్తిరించి ఆ రూ.10,00,000 లో నగదును దొంగిలించాడు. బస్సు ఎక్కినప్పుడు తన నగదును పోగొట్టు కున్నానని తెలుసుకున్న బాధితుడు బోడపాటి నాగేశ్వరరావు వెంటనే అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ ఘటనపై భారత న్యాయ సంహిత 115/2025 యు/ఎస్ 303(2) సెక్షన్ల క్రైం నెంబరు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దాపురం డి.ఎస్.పి. డి.శ్రీహరిరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, ప్రతిపాడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్యఅప్పారావు వెంటనే అన్నవరం చేరుకొని బాదితునితో మాట్లాడి జరిగిన నేరం గురించి తెలుసు కున్నారు. ఈతరహ నేరాలు చేసేవారి గురుంచి ఆరా తీసి నాలుగు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శంఖవరం మండలం మండపం వెళ్ళే మార్గంలో జాతీయ రహదారిపై విశాఖపట్నం డాల్ఫేన్ కైలాష్ పర్వంనకు చెందిన కంబాల శ్రీను (42) ఒక సంచీ పట్టుకుని అను వ్యక్తి అనుమానస్పదంగా ఉండడాన్ని గమనించి అతనిని మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించారు. అన్నవరం బస్సు స్టాండ్ లో తానూ చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతని నుంచి చోరి సొత్తు రూ. 10,000,00 ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పత్తిపాడు కోర్టులో హాజరు పరచనున్నట్టు, చోరీ ఘటనను, నిందితుడిని ఛేదించిన వైనాన్ని అన్నవరం ఎస్సై జి.శ్రీహరిబాబు మంగళవారం మీడియాకు ఓ ప్రకటనలో వెల్లడించారు.