గూడూరులో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

.మన న్యూస్,గూడూరు ,మే 20:ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ,ఆధ్వర్యంలో, లక్ష్య ఫౌండేషన్ మరియు డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వారి యొక్క సహాయ సహకారాలతో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగినది.మంగళవారం గూడూరు నియెజకవర్గం లోని డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ మరియు రాఘవేంద్ర మీనా ఐ .ఎ. ఎస్ సబ్ కలెక్టర్ గూడూరు మెగా జాబ్ మేళా ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.ముఖ్య అతిధులు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మెగా జాబ్ మేళా ను ఉద్దేశించి మాట్లాడుతూ…… ముఖ్యమంత్రివర్యులు 20 లక్షలు ఉద్యోగాలలో భాగంగా ఇక్కడ మూడవసారి మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.ఈ మెగా జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి 12000/- నుంచి 20000/- వరకు వేతన సదుపాయం కలదు అని తెలియజేశారు. అదేవిధంగా ఉద్యోగంలో సెలెక్ట్ కాని వారికి త్వరలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని తెలియజేశారు.గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నిరుద్యోగ యువత గురించి మాట్లాడుతూ…… కుటుంబాల అభివృద్ధి కోసం మీరు మంచి ఉద్యోగ అవకాశాలు పొంది తద్వారా కుటుంబ అభివృద్ధికి తోడ్పడాలి తెలియజేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో గూడూరు నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా నిర్వహించ బడుతుందని తెలియజేశారు.అదేవిధంగా 20 లక్షలు ఉద్యోగాలలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది అని తెలియజేశారు.ఈ జాబ్ మేళా లో పాల్గొన్న కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు గురించి మాట్లాడుతూ…. నిరుద్యోగ యువతీ యువకులకు మంచి అవకాశాలు కల్పించాలని తెలియజేశారు.మరో ముఖ్య అతిథులు రాఘవేంద్ర మీనా ఐఎఎస్,సబ్ కలెక్టర్, గూడూరు మెగా జాబ్ మేళా ఉద్దేశించి మాట్లాడుతూ …..ఈ మెగా జాబ్ మేళా కు హాజరైన అన్ని కంపెనీలకు యువతీ యువకులు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిన కంపెనీలో జాయిన్ అవ్వాలని తెలియజేశారు. ఈ మెగా మెగా జాబ్ మేళా లో హాజరైన యువతి యువకులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఆర్. లోకనాథం, డిఎస్డివో, Apssdc మాట్లాడుతూ…… జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ మెగా జాబ్ మేళాకి 21 బహుళ జాతీయ కంపెనీలు మెగా జాబ్ మేళాకు హాజరు అవ్వగా 432 మంది హాజరవుగా, 232 మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయ్యి, అలాగే 19 మంది షార్ట్ లిస్ట్ అవడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆర్. లోకనాథం,జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, వై విద్యాసాగర్ ట్రెజరర్ డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల గూడూరు, ఏ హనుమంతరావు ప్రిన్సిపాల్ , డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల , డి భాను చంద్ర , ప్లేస్మెంట్ ఇంచార్జ్, లక్ష ఫౌండేషన్, చెంచు రామయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్, డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కాలేజ్, మధుసూదన్ రావు ఎంపీడీవో, గూడూరు మండలం, .వెంకటేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్,గూడూరు, ఎస్కే. రహీం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్, టి.శ్రీనివాసులు , టిడిపి ప్రెసిడెంట్, గూడూరు, ఏ.మస్తాన్ నాయుడు, టిడిపి, వై శ్రీనివాసులు రెడ్డి ,టిడిపి లీడర్ మరియు టిడిపి, జనసేన, బిజెపి ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు మరియు మొదలగువారు పాల్గొనడం జరిగినది.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా