హీరో సిద్ధార్థ్ ”మిస్ యు” నవంబర్ 29న థియేటర్స్ లో విడుదల !!!

Mana Cinema:- హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దార్థ్ మునుపటిలా తనలోని రొమాంటిక్ వైబ్స్ చూపించబోతున్నాడు. అదే విధంగా ఈ చిత్ర కథ ఫీల్ గుడ్ కంటెంట్ తో ఉండబోతోంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ.. ప్రేమలో ఉన్న బలహీనతల చుట్టూ ఈ చిత్ర కథ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో అని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో జెపి, పోన్వన్నన్, బాల శరవణన్, కరుణాకరన్ లాంటి నటులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. కేజీ వెంకటేష్ సినిమా టోగ్రాఫర్ గా వ్యవహరించారు. సంగీతంతో పాటు సినిమాలోని విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రేమలో సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎంటర్టైనింగ్ గా అదే సమయంలో ఎమోషనల్ గా చెప్పినట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. నవంబర్ 29న రిలీజ్ అవుతున్న మిస్ యు చిత్రాన్ని ఏషియన్ సురేష్ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది.

  • Related Posts

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం, హర్షిత హీరో–హీరోయిన్లుగా ‘జోష్’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం ‘మై లవ్’ తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే…

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి