

మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్ నెల్లూరు సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ జిల్లా సైనిక సంక్షేమ అధికారి హరికృష్ణ సారధ్యంలో వి. ఆర్.కళాశాల మైదానం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ బొమ్మ కూడలి వరకు ఏప్రిల్ 22న మూ కాశ్మీర్ లోని పహాల్గాం ప్రాంతంలో 26 మంది పర్యాటకులను పాక్ ఉగ్రవాదులు వారి భార్యా పిల్లల ముందే కాల్చి చంపిన నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భారత సైన్యం కల్నల్ సోఫియా ఖురేషి, మరియు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ సారథ్యంలో పాకిస్తాన్ కు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతం చేసిన నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సైనిక సంక్షేమ అధికారి హరికృష్ణ, విశ్రాంత ఎయిర్ వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, కే ఎన్ ఆర్ హై స్కూల్ ఎన్సిసి నేవల్ క్యాడెట్లు, ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ….. భారత దేశం శాంతియుత దేశమని యుద్ధాన్ని ఎప్పుడు కోరుకోదని మన మంచితనాన్ని చేతగానితనంగా చూస్తే చూస్తూ ఊరుకోబోమని అటువంటి వారికి తగిన గుణపాఠం నేర్పుతామని భారతదేశ స్త్రీల నుదుటి సింధూరాన్ని తీస్తే చూస్తూ ఊరుకోబోమని అటువంటి ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పేందుకే భారత వీర సైనిక నారీ మణులైన కల్నల్ సోఫియా ఖురేషి, ఎయిర్ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ నేతృత్వంలో కేవలం 25 నిమిషాల సమయంలో పాకిస్తాన్ కోలుకోలేని విధంగా పాకిస్తాన్ లోని సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే ఆపరేషన్ సిందూర్ దాడి పట్టిందని ఈ నేపథ్యంలో అమరులైన భారత వీర సైనికులకు ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశం యొక్క సత్తాని ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సిందూర్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు.
