మన న్యూస్, నెల్లూరు, మే 18 :*ఇది నవ భారతం సహనం అంటూ కూర్చుండే ప్రసక్తే లేదు.*హద్దు దాటితే తాట తీస్తాం ఎవరికైనా ధీటుగా సమాధానం చెబుతాం అంటూ జవాబు చెప్పిన మన జవానుల వెన్నంటి ఉన్నాం అని తెలుపుతూ తిరంగా ర్యాలీ లో జనసేన నేత గునుకుల కిషోర్ అన్నారు.ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీని నిర్వహించాలని ప్రభుత్వ సూచనలతో బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కూటమి నాయకులు వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత గురుకుల కిషోర్ మాట్లాడుతూ……భారత త్రిదల జవాన్ల టెస్ట్ డ్రైవ్ యుద్ధానికి పాకిస్తాన్ తలకిందులైందివ ,దేశ హరిహద్దు దాటి వచ్చి భయపించాలని చూస్తే పాకిస్తాన్ చివరి పౌరుడు దాకా వెన్నులో వణుకు పుట్టించిన మన జవాన్లు దేశం మొత్తం తోడుగా ఉన్నామని సంఘీభావం తెలుపుతూ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ కూటమి ప్రభుత్వం తలపెట్టిన తిరంగా ర్యాలీని నడిపిన కుటుంబ నాయకులకు పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.నా తల్లుల సింధూరాన్ని దూరం చేయాలనుకున్న పాకిస్తాన్ పిరికిపందలకు ఆపరేషన్ సింధూర్ సరైన సమాధానం ఇచ్చింది అని అన్నారు.ఇది నవ భారతం సహనం ఓపిక నశించాయి…ఇక సహించేది లేదని సమర్థవంతంగా నెలలోనే జవాబు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కి జవానులకు జోహర్లు అని అన్నారు.యుద్ధం ముగియలేదు… పాకిస్తానీయులు ఏ రోజు తోక జాడించిన కత్తిరించి చేతులో పెడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది…. అని తెలిపారు.జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతలో దేశభక్తిని నింపుతుంటారు.. వారి మాటలను వక్రీకరించిన సూడో సెక్యులర్ నాయకులు సిగ్గుపడాలి… అని అన్నారు.ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ కి,ఇతర జవానులకు జోహార్లు అర్పిస్తూ….జాతి స్ఫూర్తికి భంగం కలిగిస్తే ప్రభుత్వ నిర్ణయం ఏదైనా ప్రతి భారతీయుడూ సిద్ధమే అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *