

మన న్యూస్ సింగరాయకొండ :-
ఉలవపాడు మండలం, భీమవరం గ్రామానికి చెందిన దేవండ్ల అర్చన పరమేశ్వరి (3 సం) మూడు రోజుల క్రితం పాప సృహతప్పి పడిపోవడంతో ఒంగోలు KIMS హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించి, మెదడు వాపు వచ్చిందని, వెంటిలేటర్‌పై చికిత్స అవసరమని తెలిపారు. వైద్య ఖర్చులు రూ. 5 నుండి 8 లక్షలు అవుతాయని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. పాప తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా భరించే సామర్థ్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సింగరాయకొండ అప్డేట్స్ చైర్మన్ సాంబ చెన్నంశెట్టి వారి మిత్రులు కలిసి, పాప వైద్యానికి రూ. 40,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయాన్ని సింగరాయకొండ అప్డేట్స్ సభ్యులు చెన్నంశెట్టి సాయి మనోజ్, హరి, రాకేష్ దారుకుమల్లి లు అర్చన తండ్రి దేవండ్ల శివకుమార్ గారికి అందజేశారు.
పాప ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ, తమ వంతు సహాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు.