

సింగరాయకొండ లో ఎయిడ్స్ మృతుల స్మారక కొవ్వొత్తుల ప్రదర్శన.
మన న్యూస్ సింగరాయకొండ:-
మహమ్మారి ఎయిడ్స్ మృతుల కుటుంబాలు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు వారి కుటుంబాల పట్ల వివక్షత వద్దు అని వారి పట్ల సమాజం ఆదరించాలని సింగరాయకొండ ప్రాధమిక వైద్య శాల వైద్యులు, ఐ సి టి ఎస్,ఎం ఎల్ ఎస్, ఒ ఆర్ డబ్ల్యూ నిర్వాహకులు పిలుపు ఇచ్చారు. ఆదివారం రాత్రి అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరాయకొండ ఒ ఆర్ డబ్ల్యూ,ఎం ఎల్ ఎస్ సిబ్బంది కార్యకర్తలు, ఉన్నత శ్రేణి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణం లో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల ర్యాలీ కి సంబంధించి రంగవల్లి ఏర్పాటు చేసి కొవ్వొత్తులతో తమ ప్రగాఢ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఉన్నత శ్రేణి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే ఐ సి టి సి కౌన్సిలర్ జి.ప్రసాద్,ఎం ఎల్ ఎస్ మేనేజర్ ఎం వెంకటరావు, ఒ ఆర్ డబ్ల్యూ కార్యకర్త కె.నాగమణి, సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు.