

మన న్యూస్ సింగరాయకొండ:-
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన తిరంగా యాత్ర కార్యక్రమం ఈరోజు సింగరాయకొండ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో జాతీయ జెండా పట్టుకుని భారత సైనికులకు, భారతమాతకి, వందేమాతరం అంటూ నినాదాలు హోరెత్తింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్చార్జి మిడసల బాలకోటయ్య, రమేష్, కోమల్ రావు, ప్రియరాధిక, తన్నీరు లక్ష్మి, ప్రసాద్, మధు, రామకృష్ణ, అల్లరి రామయ్య మరియు టీడీపీ సింగరాయకొండ మండల అధ్యక్షులు వేల్పుల సింగయ్య, జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, ఐయినాబత్తిన రాజేష్, గూడా శశిభూషణ్, కాసుల శ్రీను, అనుమల శెట్టి కిరణ్ బాబు, రాజు, దారం పవన్ కుమార్, మెండా మహేంద్ర బాబు మరియు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.