

మన న్యూస్, కోవూరు, మే 13 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో మంగళవారం నెల్లూరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో 50ప్రాంతాలలో సమ్మర్ క్యాంప్ లను నిర్వహించిన క్యాంప్ ఇన్చార్జులకు క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం, అందులో భాగంగా సమ్మర్ క్యాంపులు నిర్వహించి, విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగించి భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదిగేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ కి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు.టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురహరి, జిల్లా ఒలంపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ రెడ్డి, డి.ఎస్.డి.ఓ. ఇతిరాజు, క్లస్టర్ ఇంచార్జ్ షంషుద్దీన్, టిడిపి నాయకులు పామూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
