

మన న్యూస్, కోవూరు, మే 13:గత సంవత్సరం ఇదే రోజున మీరు మన టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నమ్మకం ఉంచి ఓటు వేసి, అఖండ (54621) మెజార్టీ తో చారిత్రాత్మక మైనా విజయాన్ని అందించి ఆమె మన నియోజకవర్గన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు.మీ విలక్షణమైన తీర్పుతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చారు. నా దైవం నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర పురోభవృద్ధికి భాగస్వామ్యులయ్యారు.ఈ విజయాన్ని సాధించడానికి మీరు చూపిన ఆదరణకు, మమ్మల్ని నమ్మి ఇచ్చిన ఆమోదానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ గడిచిన సంవత్సరంలో మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిత్యం కృషి చేస్తున్నారు. మీరు చూపిన ప్రేమ, ఆదరణ, విశ్వాసం వేమిరెడ్డి దంపతులు చేసే సేవా కార్యక్రమాలకు మరింత శక్తిని ఇచ్చాయి.ప్రజల కోసమే పని చేయాలి అన్న అభిమానం టీడీపీ నాయుకులు గా మాకు ప్రతి రోజూ ప్రేరణగా మారింది.ఈరోజు, మన ప్రజాస్వామిక విజయానికి గుర్తుగా, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మీరు చూపిన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద ఉండాలని కోరుకుంటున్నాను.మీ ఆశీర్వాదంతో, సదా మీ సేవలోసత్యంరెడ్డి తెలుగుదేశంరాష్ట్ర ఐటీడీపి కార్యదర్శి అని ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
