మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అనంతరం రిజిస్టర్ ని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులకు కావలసిన మందుల వివరాలను మండల వైద్యాధికారి రోహిత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సమయపాలన పాటించి రోగులకు నాణ్యతమైన చికిత్సను అందించాలని సూచించారు. అనంతరం జూనియర్ కళాశాలను సందర్శించి కాలేజీలో 22 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రతిరోజు ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ హాజరు కాకపోవడంతో తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్ ,మండల ప్రత్యేక అధికారి శ్రీపతి, తదితరులు ఉన్నారు.









