మన న్యూస్ ,నెల్లూరు, మే 12:ఇటీవల వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరిన నాయకులు, ఇదివరకే టిడిపిలో ఉన్న నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్టీకి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి మంచి పేరు తీసుకురావాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఇటీవల పార్టీలో చేరిన విడవలూరు, అన్నా రెడ్డిపాలెం దంపూరు అలగానిపాడు రామతీర్థం రామచంద్రాపురం, దండిగుంట వావిళ్ళ, చౌకచర్ల గ్రామాలకు చెందిన వైసిపి నుండి ఇటీవల ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన నాయకులు, ఇదివరకే పార్టీలో ఉన్న టిడిపి నాయకులతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో విభేదాలు లేకుండా ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందజేయాలన్నారు.అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని వారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *