

మన న్యూస్ : శేరిలింగంపల్లి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఈ నెల 18 తేదీ నుండి 22 వ తేదీ వరకు నిర్వహించే క్రీడా ఉత్సవాలు – స్పోర్ట్స్ మీట్- 2024 ను పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని సోమవారం ఏంఈఓ వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా మహోత్సవం (స్పోర్ట్స్ మీట్) నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయమని, సుమారు 50 పాఠశాలల విద్యార్థులు 5,000 మంది, టగ్ ఆఫ్ వార్,త్రో బాల్,ఖో,ఖో,క్రికెట్ రన్నింగ్ వంటి ఆటలు నిర్వహిస్తున్నారు. పిల్లలలో దాగిన సృజనాత్మకత ను బయటకి వెలుగు దీయడానికి ఎంతగానో తొడపడుతుంది అని , పిల్లలకు చదువు తో పాటు క్రీడలు ఎంతగానో ముఖ్యం అని ,క్రీడల తో శారీరక శ్రమ తో పాటు మానసిక ఉల్లాసం కలుగును అని , పిల్లలు చదువుల తో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుడే మంచి భావి పౌరులుగా దేశానికి సేవలు అందిస్తారు అని,తల్లిదండ్రులకు ,దేశానికి మంచి సేవలు అందించాలని ,విద్య అభివృద్ధి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పీఏసీ చైర్మన్ గాంధీ పేర్కొన్నారు.సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పారిష్కారం అయ్యలే తన వంతు కృషి చేస్తానని , నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని. ఈ కార్యక్రమంలో ఎండి ఇబ్రహీం, లయన్ డా.వేంకటేశ్వర రావు ,ఆచార్య,శ్రీనివాస్ శంకర్,రెహ్మాన్ , అనిల్ కుమార్, ఎన్. ఎస్.రావు,భీస్మారెడ్డి, భరత్ కుమార్,రాజు,విజయ్, ప్రద్యుమ్న, ప్రవీణ్,పవన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.