చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువులను పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాథ్

మన న్యూస్: షేర్ లింగంపెల్లి చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేగులకుంట చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షి కుంట చెరువు కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి బక్షికుంట పరిసరాలను పరిశీలించి ఆక్రమణల గూర్చి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెరువు విస్తీర్ణం, ఎప్పటి నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయి. పర్మిషన్లు ఎలా ఇచ్చారు అన్న దానిపై ఆరా తీశారు. చెరువులో ఉన్న నిర్మాణాలు, రోడ్లు ఎవరేశారు అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం చందానగర్ లోని రేగులకుంట చెరువును మల్లిగవాడ ఫౌండేషన్ చైర్మన్ ఆనంద్ మల్లిగవాడతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా తనపని తాను చేసుకుపోతుందని, ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తప్పవని అన్నారు. హైడ్రా కమిషనర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు నాగరాజు, నళిని, రాజశేఖర్, సీపీఎం నాయకులు శోభన్, కృష్ణ, సీపీఐ నాయకులు రామకృష్ణ, చందు యాదవ్, దీప్తి శ్రీనగర్ కాలనీ ప్రెసిడెంట్ సీతారామయ్య ఇతర కాలనీవాసులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.