

Mana News:- వెదురుకుప్పం మన న్యూస్ :- మండల కేంద్రంలో వెలసిన శ్రీకృష్ణ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో సోమవారం ఉదయం వైభవంగా మహా సంప్రోక్షణ పూజలు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిరిలు వేసి విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు వేద పండితుల చేత వేద పారాయణము గణపతి పూజలు హోమము ఇత్యాధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దైవదర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పేట రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంగళవారము బుధవారము ప్రత్యేక పూజలు ఉంటాయని, మూడవ రోజు అయిన బుధవారం 11 గంటలకు అమ్మవారి కళ్యాణం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ ముఖ్య కార్యనిర్వాహకులు ఆంజనేయులు రెడ్డి, కృష్ణారెడ్డి ఉమాపతి రెడ్డి, నరసింహారెడ్డి, హరినాథ్ రెడ్డి, జయరామ్ జీవన్ బాబు, లోకనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు