ఎస్సీ సెల్ మండల అనుబంధ విభాగ అధ్యక్షునిగా సరిపల్లి వెంకటేష్…

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌతులపూడి మండల ఎస్సీ సెల్ విభాగానికి అధ్యక్షునిగా సరిపల్లి వెంకటేష్ నియమితులయ్యారు. గతంలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన విశేష సేవలు, దళిత ఉద్యమాలలో చురుగ్గా ఉండి, దళితుల పక్షాన పోరాటాలు చేసిన ఘనత గాను ఈ గుర్తింపు లభించిందని పలువురు పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ ముద్రగడ గిరి బాబు మాట్లాడుతూ, రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రౌతులపూడి మండల యూత్ వింగ్ సోమరౌతు రాజా, వాలంటీర్స్ వింగ్ కరక అశోక్, సోషల్ మీడియా వింగ్ బొడ్డు నాని, మహిళా విభాగం దెయ్యాల బేబీ, రైతు విభాగం కర్రి చిట్టిబాబు, బీసీ సెల్ సింగంపల్లి చిట్టిబాబు, ఎస్టీ సెల్ చెన్నాడ దేవుడు, మైనార్టీ సెల్ షేక్ వల్లి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ బండారు బైరాగి, స్టూడెంట్ వింగ్ రౌతు ఫణి దుర్గా నారాయణ, పంచాయితీ రాజ్ వింగ్ భీమలింగం నాగరాజు, వాణిజ్య విభాగం బండారు వెంకన్నబాబు, పబ్లిసిటీ వింగ్ మంతెన పాపారావు లను రౌతులపూడి మండల అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.

  • Related Posts

    విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి వినతి పత్రం అందజేత..!

    వింజమూరు మన న్యూస్ : నియోజకవర్గంలో ఉన్న విలేజ్ సెక్రటేరియట్ సిబ్బంది సమస్యలను తీర్చాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ విలేజ్ చక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం…

    ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    వింజమూరు మన న్యూస్ : సిబిఎన్ అంటే ఒక వ్యక్తి కాదు అద్భుతమైన శక్తి అని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఆదివారం వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో ఉన్న ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి వినతి పత్రం అందజేత..!

    విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి వినతి పత్రం అందజేత..!

    ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఈస్ట్ వుడ్ ఇంగ్లీష్ స్కూల్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

    మహిళ అనుబంధ విభాగ మండల అధ్యక్షురాలుగా దెయ్యాల బేబీ

    క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా నాగబత్తుల ప్రేమ్ కుమార్

    క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా  నాగబత్తుల ప్రేమ్ కుమార్

    సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

    సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

    నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

    నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్