

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి పరీక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి వి సుధాకర్,జిల్లా వనరుల కేంద్రం -ఒంగోలు వ్యవసాయ అధికారిణి వెంకట శేషమ్మ హాజరయ్యారు.
మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ. మట్టి పరీక్షల ప్రాముఖ్యతను గురించి మరియు మట్టి నమూనాలు సేకరణ పద్ధతి గురించి తెలియజేశారు. మండలంలోని రైతులు మట్టి నమూనాలు సేకరించి మట్టి పరీక్ష నిమిత్తం స్థానిక రైతు సేవా కేంద్రాలలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మట్టి నమూనాలను మట్టి పరీక్ష కేంద్రం ఒంగోలు నకు పంపించవలసినదిగా కోరి ఉన్నారు. వ్యవసాయ అధికారిణి వెంకట శేషమ్మ మాట్లాడుతూ మట్టి పరీక్షలు చేయడం వలన మట్టిలోని వివిధ పోషకాల స్థాయిని పర్యవేక్షించి వాటి ఆధారంగా ఎరువులు ఉపయోగించడం వలన రైతులు సాగు ఖర్చును తగ్గించుకొని నికర లాభాలు పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్, మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు సోమరాజు పల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు