

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన మేస్త్రి ఆంజనేయులు (34) దాదన్ పల్లి గ్రామానికి చెందిన గొర్ల కాపరి కురుమూర్తి (16) అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వ్యవసాయని తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉటా ఉటిన వారి స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున సాయం అందించే విధంగా కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి ప్రగాఢ సానుభూతిని తెలియపరచడం జరిగింది. దాదాన్ పల్లి గ్రామ ప్రజలు మా గ్రామంలో నిరంతరం విద్యుత్ సమస్య ఉంటుందని ఎమ్మెల్యే కు ప్రస్తావించగా ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులకు పిలిపించి వారం రోజులలో విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని విద్యుత్ అదికరులకు తెలిపారు.