

మన న్యూస్ సింగరాయకొండ:-
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన భయానక ఉగ్రవాద దాడికి గాను దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిన వేళ, నేడు సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ తమ సంఘీభావాన్ని చాటుతూ తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, జవాన్లపై జరిగిన ఈ దాడి దేశాన్ని కలచివేసిందని, అమరులైన వీరుల త్యాగాన్ని దేశ ప్రజలందరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, భద్రతా బలగాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలియజేశారు.