

- శంఖవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రపంచ మలేరియా దినోత్సవం
శంఖవరం మన న్యూస్ (అపురూప్): పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ కు ప్రతి ఒక్కరిలో మార్పు తప్పనిసరి అని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్య అధికారి ఆర్ వి వి సత్యనారాయణ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఆర్ వి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ ఎస్ రాజీవ్ కుమార్ అధ్యక్షతన ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఆర్ వి వి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆగస్టు 20, 1897ల సర్ రోనాల్డ్ రాజ్ ఆడ అనాఫిలిస్ దోమ కడుపులో పరాణజీవి ఉందని గుర్తించారని తెలియజేశారు. అందరిలో మార్పు వస్తేనే మలేరియా అంతమవుతుందని తెలియజేశారు. డాక్టర్ ఎస్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, దోమ కాటు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై వివరించారు. దోమకాటు వాళ్లు వచ్చే వ్యాధులు నివారణకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలను సూచించారు. సబ్ యూనిట్ ఆఫీసర్ బి ఎర్ర అబ్బాయి మాట్లాడుతూ, నీటి నిలువలు ఉన్న ప్రదేశాలను మట్టితో పోడ్చాలని, నీట్లు నిలవ ఉండే పాత్రలపై మూతలు వెయ్యాలని పిలుపునిచ్చారు. తద్వారా దోమల వ్యాప్తిని తగ్గించవచ్చని దాని ద్వారా మలేరని అరికట్టొచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యులు డాక్టర్ రవిశంకర్ , సి హెచ్ ఓ మేరీ మణి, పీహెచ్ఎన్ కృష్ణకుమారి, హెచ్ వి ఏ వి సూర్యనారాయణమ్మ, కే విజయ కుమారి ,పీహెచ్సీ లాబ్ ఇన్చార్జ్ రాజశేఖర్, హెల్త్ సూపర్వైజర్లు,హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఎమ్ ఎల్ హెచ్ పి లు మరియు ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..