

మన న్యూస్ సింగరాయకొండ:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కొండేపి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 6 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులను కేంద్ర కార్యాలయం నియమించింది.సింగరాయకొండ మండలానికి మసనం వెంకట్రావు అధ్యక్షుడిగా నియమించారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వెంకట్రావు కు ఈ పదవి ద్వారా మరింత బాధ్యతలు అప్పగించబడ్డాయి.ఇతర మండల అధ్యక్షులు: • టంగుటూరు – చింతపల్లి హరిబాబు • కొండేపి – బచ్చల కోటేశ్వరరావు • జరుగుమల్లి – పిన్నిక శ్రీనివాసులు • పోన్నలూరు – దుద్దుకుంట మల్లికార్జున రెడ్డి • మర్రిపూడి – ఇంకోలు సుబ్బారెడ్డికొండేపి నియోజకవర్గ స్థాయిలో పార్టీని పునఃఘటితం చేస్తూ, బూత్ స్థాయిలో మరింత బలంగా తయారుచేయాలని వైసీపీ నాయకత్వం సంకల్పించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.