

మనన్యూస్,కావలి:ప్రజా సంక్షేమ సారధి…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆదివారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదేశాలతో కావలి పట్టణ టిడిపి కమిటీ ఆధ్వర్యంలో కావలి టిడిపి కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు టిడిపి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.టిడిపి నాయకులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.