• ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో పార్టీలోకి భారీ చేరికలు…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం అక్టోబర్ 11 :దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతుగా వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 200 మంది నాయకులు,కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు.34వ వార్డు సీనియర్ నాయకులు జెర్రిపోతుల ప్రసాద్ఆ ధ్వర్యంలో ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో నూతన సభ్యులు జనసేన పార్టీ కండువాలు ధరించి పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో వివిధ హోదాల్లో పనిచేసిన శంఖబత్తుల సన్యాసిరావు (స్టేట్ బూత్ వింగ్ సెక్రటరీ),సరిపిల్లి అరుణ (వార్డు మహిళా అధ్యక్షురాలు), వల్లి శ్రీనివాసరావు,శ్రీరాం నరసింగరావు,శ్రీరాం శేఖర్, కంబాల జగదీష్,యాళ్ల జిరావు(బూత్ అధ్యక్షులు),జి. రామకృష్ణ(చిన్న) తదితర సీనియర్ నాయకులతో పాటు సుమారు 200 మంది నాయకులు,కార్యకర్తలుజనసేనలో చేరారు.34వ వార్డులోని చంగల్రావుపేట బజార్,బుక్కా వీధి,కొత్త అగ్రహారం ప్రాంతాలకు చెందిన నూతన సభ్యులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు,సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారని పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతూ, అందరూ సమష్టిగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో 36వ వార్డు అధ్యక్షులు పడమటి శ్రీనివాస్,కోసూరు వాసు, శ్రీధర్,పరమేష్,రాజ్ కుమార్,పరశురామ్, సోమేశ్వరరావు,వాసుపల్లి సురేష్ తదితర జనసేన పార్టీ నాయకులు,వీర మహిళలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *