

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): నగర పంచాయతీలో రన్ ఫర్ జీసస్ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఘనంగా నిర్వహించారు.మండలంలో ఉన్న క్రైస్తవ సంఘాలు రెండు వేలమంది పాల్గొన్నారు. బాలాజీ చౌక్ సెంటర్ నుంచి గవర్నమెంట్ హాస్పటల్ వరకు బిషప్ జోసఫ్ ఆండ్రూస్ జెండా ఊపి రన్ ఫర్ జీసస్ ప్రారంభించారు. తెల్లని వస్త్రాలు ధరించి, జెండాలు పట్టుకొని క్రీస్తు సమాధి గెలిచాడని ఉత్సాహంగా పరిగెత్తుకుని వెళ్లారు.