

పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):=
పార్వతిపురం మంజం జిల్లా పాచిపెంట మండలంలో రెండు నెలలకు పైగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకపోవడం వలన గెడ్డ ఊట చలమనీరు కలుషితనీరు త్రాగి రోగాలు మారిన పడుతున్న కుమ్మరివలస గిరిజనులు త్రాగునీటి సమస్య మీద అధికారులకు విన్నవించుకున్న మొరపెట్టుకున్న పట్టించుకోలేదని సంబంధిత అధికారులు ఆవేదన చెందిన గిరిజనులు, పాచిపెంట మండలం కేసలి పంచాయితీ నిర్వాసిత గిరిజన గ్రామమైన కుమ్మరవలస గ్రామానికి గిరిజనులకు రెండు నెలలకు పైగా మోటారు పాడైపోయిందని అప్పటినుంచి ఎంపీడీవో కి ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసిన వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని,స్థానిక సిపిఎం నాయకులు అప్పటినుంచి ఎంపీడీవో కి ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసిన వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని స్థానిక సిపిఎం నాయకులు దిసరి వసంతరావు స్థానిక మహిళలు కోడికాల బీమాలు నారాయణమ్మ బుచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. గత నెల గ్రామం మొత్తం గిరిజనులందరూ జ్వరాలు బారిన పడ్డారని పాచిపెంట ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యాధికారులు రక్తపరీక్షలు నిర్వహించి వైద్యం అందించారని ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రెండు నెలల క్రిందట ఎండిఓకి వాటర్ సమస్య వలన బోరు బాగు చేయండి మోటార్ బాగు చేయండి అని వినతిపత్రం ఇస్తే నేటికీ కూడా ఆ గ్రామానికి వెళ్లకుండా ఆ గ్రామ గిరిజనులు పట్టించుకోకుండా వ్యవహరించడం నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ గ్రామంలో బోరు ఒకటి తీయాలని అలాగే పాడైపోయిన మోటార్‌ను బాగు చేసి ట్యాంకు ద్వారా నీరు అందించి గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కిలో మీటర్ పైగా గెడ్డ వాగు నుంచి పెద్ద పెద్ద ఒడ్డులు ఎక్కి త్రాగునీటి కోసం కలుషితమైన చలం గెడ్డ ఊట నీరు త్రాగి అనారోగ్యాలు ఫాలోతున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన చేసి, పాడైపోయిన బోరును బాగు చేసి ట్యాంకుల ద్వారా నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక సిపిఎం నాయకులు దీసరి వసంతరావు మాట్లాడుతూ త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకపోతే మా గ్రామం నుంచి పాదయాత్రగా ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు, మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.