

ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) నవంబర్ 16
నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో భారతీయ జనతా పార్టీ సంఘటన పర్వ్ 2024లో భాగంగా బూత్ కమిటీ ఎన్నికలకి సంబంధించి శనివారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎన్నికల అధికారి గా నియమింపబడిన మట్టా మంగరాజు,సహాయ ఎన్నికల అధికారిగా కామినేని జయశ్రీ విచ్చేసారు.వారికి కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు,నియోజవర్గ కన్వీనర్ సింగిలిదేవి సత్తి రాజు స్వాగతం పలికారు.ఎన్నికల ఆర్వోగా పతివాడ వెంకటేశ్వరరావు,ఏఆర్ఓ మేడసాని సత్యనారాయణ,ప్రతిపాడు మండలం అధ్యక్షులు కందా వీరాస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు జోగురాజు,ప్రతిపాడు మండలం ఉపాధ్యక్షులు ఊటా వీరబాబు,నానిపల్లి శ్రీనివాస్,సూర్యనారాయణతదితరులు పాల్గొన్నారు.