మనన్యూస్,నెల్లూరు:
అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్. బి ఆర్.అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరిస్తూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు.డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు నాయకులు వీఆర్సీ సర్కిల్ నందు గల వారి విగ్రహానికి మాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ….. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, అన్నిటికి మించి ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్మరణీయులు అంబేద్కర్ అని అన్నారు.నీరు తాగడానికి, చదువుకోడానికి కూడా కుల వివక్షను ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలో పోరాడి కుల,వర్గ వివక్షల అపాలని ప్రయత్నించిన మహానుభావుడు అని అన్నారు.వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధికి రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ కులాల వారిగా వారి సంఖ్యను బట్టి వారికి అందాల్సిన ఫలాలు అందే విధంగా సంస్కరిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తాం అని తెలియజేశారు.ఈ రోజు గిరిజన తండాల్లో మౌలిక వస్తువులు రూపకల్పనకు కృషి చేస్తూ అంబేద్కర్ మహోన్నత ఆశయాలను ముందుకు తీసుకు ముందుకు నడిపిస్తున్న మరో సంఘసంస్కర్త పవన్ కళ్యాణ్ అని అన్నారు.ప్రజలు తమహక్కుల కోసం పోరాడిన వచ్చు,నిర్వర్తించవలసిన విధుల ఆవశ్యకత ను కూడా గుర్తు చేసిన మహోన్నతమైన వ్యక్తుని వ్యక్తి అంబేడ్కర్ వారి ఆశయాలను ముందుకు నడిపించేందుకు జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ స్పూర్తి తో భాధ్యత గా నడుస్తాం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *