తిరుమల లో వైసిపి హయంలో జరిగిన అక్రమాలను,అపాచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రను కాపాడుతున్న కూటమి ప్రభుత్వం………… తెలుగుదేశం నెల్లూరు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 12 : * టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని తప్పుడు ప్రచారం చేస్తున్న భూమన.* తిరుమల లో వైసిపి హయంలో జరిగిన అక్రమాలను,అపాచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రను కాపాడుతున్న కూటమి ప్రభుత్వం .)* కూటమి ప్రభుత్వానికి, టిటిడి పాలక మండలి కి వస్తున్న మంచిపేరుచూసి ఓర్వలేక రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్న వైసిపి. * నాడు వైసిపి ప్రభుత్వం వీఐపీ సేవలో తరిస్తే నేడు కూటమి ప్రభుత్వం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తుంది.* భూమన కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో సర్వ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన భక్తులను అడిగితే ఎవరి పాలన లో తిరుమల ఎలా ఉందో భక్తులే చెపుతారు.నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ………… వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది. ఆఖరకు భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డు తయారీలో కూడా కల్తీ నెయ్యి నెయ్యిని వాడింది అని అన్నారు.తిరుమల చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా వైసిపి ప్రభుత్వ హయంలో అక్రమాలు జరిగాయి.తిరుమల పవిత్రత మంట గలిసింది.సామాన్య భక్తులను గాలికొదిలి వీఐపీ సేవలో తరించారు.బ్రేక్ దర్శనాలను కూడా అమ్ముకున్న ఘనత వైసిపి ప్రజా ప్రతినిధులది అని తెలిపారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల దేవస్థానము పవిత్రతను కాపాడటానికి, సామాన్య భక్తులను మెరుగైన సేవలు అందించడానికి అనేక చర్యలు తీసుకుంది అని అన్నారు.అదేవిధంగా వైసిపి ప్రభుత్వం హయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టింది.ఈ విచారణ కారణంగా నాడు వైసిపి నాయకులు చేసిన అరాచకాలు బయటకు వస్తున్నాయి.వాటి నుండి దృష్టి మార్చడానికి టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని దృష్ప్రాచారం చేస్తున్నారు.టిటిడి గోశాలలో గోవులు సంరక్షణ కొరకు 260 మందికి పైగా సిబ్బంది పనిచేస్తూ ,గోశాలలో ఉన్న 2668 గోవులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.తిరుమల లో వైసిపి హయంలో జరిగిన అక్రమాలను,అపాచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రను కూటమి ప్రభుత్వం కాపాడుతుంది.దీనితో కూటమి ప్రభుత్వం కు మంచి పేరు వస్తుండటంతో దానిని చూసి ఓర్వలేక వైసిపి పార్టీ భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అనేక కుట్రలు చేస్తుంది అని అన్నారు.నాడు వైసిపి ప్రభుత్వం వీఐపీ సేవలో తరిస్తే నేడు కూటమి ప్రభుత్వం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తుంది. సర్వ దర్శనం చేసుకొనే భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా అనేక చర్యలు తీసుకోండి.ఉచిత అన్నదానం లో వడ్డించే భోజనం విషయంలో గాని,ప్రసాదాలు లో గాని నాణ్యతా ప్రమాణాలు మెరుగు పరిచింది అని తెలిపారు.భూమన కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో సర్వ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన భక్తులను అడిగితే ఎవరి పాలన లో తిరుమల ఎలా ఉందో భక్తులే చెపుతారు అని అన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..