
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 11 :వివక్షరహిత సమాజ స్థాపనే మనం మహాత్ములకిచ్చే ఘన నివాళిస్త్రీ విద్యను ప్రోత్సహిద్దాం, బాల్యవివాహాలు అరికడదాం ఇదే మనకు మహాత్ముడు జ్యోతిరావు ఫూలే మనకి నేర్పిన భాద్యతలు.అంటరానితనం,కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దారణకు కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ జనసేన పార్టీ తరఫున ఘన నివాళులర్పిస్తున్నాం అని జనసేన నేత గురుకుల కిషోర్ అన్నారు.జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం జనసేన నాయకులు నెల్లూరు, మినీ బైపాస్ నందుగల ఫూలే దంపతుల విగ్రహాలకి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ…….. దశాబ్దాల కిందటే స్త్రీ విద్యను ఆవశ్యకతను తెలిపారు జ్యోతిరావు ఫూలే ఇప్పటికీ నెల్లూరు సిటీ సైతం కొన్ని ప్రాంతాలలో మహిళలు విద్యాభ్యాసానికి దూరంగా ఉన్నారు.అలాగే బాల్యవివాహాలు 13 సంవత్సరాలకే జరుగుతున్నాయి.అంటరానితనం రాజ్యమేలుతున్న రోజుల్లో మనుషుల వివక్ష ను రూపుమాపటానికి కృషి చేసిన మహాత్ముడు పూలే అని అన్నారు.స్త్రీ విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను సమాజానికి తెలుపుతూ తన సతిని సతీమణిని మహిళల విద్యకు ఉపాధ్యాయునిగా మార్చిన బోధించిన సంఘసంస్కర్త అని తెలిపారు.జ్యోతిరావు పూలే బాల్య వివాహలను అరికట్టడంలోనూ వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడంలోనూ వారు శ్రమ అహర్నిశలు పోరాడారు.మహాత్ముల ఆశయాలను ముందుకు నడిపిస్తాంవవ వారి ఆశయాలకు బాసటగా నడుస్తున్న పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తాం అని తెలిపారు.
