సోలార్ పవర్ వాడుదాం — పర్యావరణాన్ని రక్షిద్దాం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

(కోవూరు,మన న్యూస్,ఏప్రిల్ 7 )- మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. – ధాన్యం అమ్మిన 24 గంటలలో రైతుల ఖాతాలలో ఘనత చంద్రబాబు దే.- కోవూరు నియోజకవర్గంలో 90 కోట్లతో విద్యుత్ శాఖలో ఆధునీకరణ పనులు. – ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటాం. – రెండు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయండి. – సబ్ స్టేషన్ శంఖుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సోలార్ పవర్ వినియోగంలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్టంలోనే రోల్ మాడల్ గా మారుస్తామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . సోమవారం ఆమె ఇందుకూరు మండలలోని కుడితి పాళెం గ్రామంలో ఆమె 2 కోట్ల 77 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 33/ 11 kv విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం లోనికి వచ్చాక కోవూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖలో 90 కోట్లు వెచ్చించి కొత్తగా త్రీ ఫేస్‌ పవర్ లైన్స్, 33 kv లైన్స్, అదనపు ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాట్లు లాంటి ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. కోవూరు నియోజకవర్గానికి రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలియచేసారు. కుడితి పాళెం గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణం వెనుక ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం దువ్వూరు కళ్యాణ్ రెడ్డి చొరవ వుందన్నారు. నిరంతర త్రీ ఫేస్‌ విద్యుత్ సరఫరాతో కుడితిపాలెం పరిసర ప్రాంతంలో ఇకపై అర్ధాంతరంగా పవర్ ట్రిప్ కావడం, లోవోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు తలెత్తవున్నారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం ఆక్వా రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అధికారంలోనికి వచ్చిన పది నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతల రహిత రోడ్ల ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటలలో రైతుల ఖాతాలలో డబ్బులు వేసి ఆదుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కు ఆమె ధన్యవాదాలు తెలియచేసారు. సాంప్రదాయ విద్యుత్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఇంట్లో సోలార్ పవర్ పవర్ వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. “ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్‌ బిజిలి” పధకంలో భాగంగా ఎస్సి, ఎస్టీలకు సోలార్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. సోలార్ విద్యత్తు ప్రోత్సాహకాల్లో భాగంగా బిసిలకు కేంద్ర ప్రభత్వం యిచ్చే 60 వేల సబ్సిడీతో పాటు రాష్టం మరో ఇరవై వేలు ఇస్తుందన్నారు. కేంద్ర, రాష్ట ప్రభత్వాలు యిచ్చే సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని ప్రజలు సోలార్ విద్యుత్ వినియోగం వైపు మొగ్గు చూపాలన్నారు. సోలార్ పవర్ వినియోగంపై గ్రామాలలో చదువుకున్న యువత పెద్దలకు అవగాహన కల్పించాలన్నారు. కోవూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అధికారుల పనితీరు పట్ల ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసారు. పదిహేనేళ్లుగా విద్యుత్ సదుపాయం లేని గుమ్మళ్ళదిబ్బలో వందకు పైగా స్తంబాలు వేసి యుద్ధప్రాతిపదికన విద్యుత్ కనెక్షన్స్ యిచ్చిన ట్రాన్స్కో సిబ్బందిని ఆమె అభినందించారు. రెండు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి ట్రాన్స్కో ఎస్ ఇ విజయన్, డి ఇ రమేష్ చౌదరి, ఇందుకూరుపేట మండల టిడిపి అధ్యక్షులు వీరేంద్ర నాయుడు, టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, మల్లికార్జున, చెంచుకిషోర్ యాదవ్, స్థానిక నాయకులు అప్పాని శ్రీనివాసులు,పి ఎల్ రావు, ఇంతియాజ్ జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ