మన న్యూస్ శంఖవరం అపురూప్:- మండలంలోని నెల్లిపూడిగ్రామానికి చెందిన ఎద్దు అచ్చారావు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులలో విషాదం చోటుచేసుకుంది. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు జనసేన పార్టీ నుండి శంఖవరం మండల శాఖ ముందుకొచ్చింది. జనసేన మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి ఆధ్వర్యంలో అచ్చారావు కుటుంబానికి 50 కేజీల బియ్యం మరియు తగిన ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన గ్రామ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా తలపంటి బుజ్జి మాట్లాడుతూ,”జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నా, సహాయం అవసరమైనా, మన పార్టీ చేతులు చాచి సహకరిస్తుంది. అచ్చారావు కుటుంబానికి మేము శక్తివంచన లేకుండా అండగా ఉంటాం” అని అన్నారు. కుటుంబ సభ్యులు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామస్థులు కూడా ఈ సహాయ కార్యక్రమాన్ని అభినందించారు. జనసేన పార్టీ నిరంతరం ప్రజా సేవకు అంకితమై పనిచేస్తుందని, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని హాజరైన సభ్యులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *