మనన్యూస్,కామారెడ్డి:మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారు సర్వేనెంబర్ 85లో నిర్మల సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్ జీవధాన్ కాన్వెంట్ వారు నిర్మిస్తున్న భూమిలో ప్రహరీ గోడ విషయంలో రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు,రామేశ్వర పల్లి తాండ రైతులు పంట పొలాలకు వెళ్లే దారిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని అడ్డుకుంటున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా 15 పిట్ల రోడ్డు ఉందని, మేము పంట పొలాలకు వెళ్లాలంటే ప్రహరీ గోడ నిర్మించి మా పంట పొలాల వద్దకు వెళ్ళనివ్వకుండా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని రామేశ్వరపల్లి తండా ప్రజలు, రామేశ్వర్ పల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. పంట పొలాలకు రైతులు వెళ్లే రోడ్డుపైన ప్రహరి గోడ నిర్మిస్తున్నారని రామేశ్వరపల్లి, తండా ప్రజలు జెసిబితో రోడ్డుపై ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, తొలగించే ప్రయత్నం చేశారు, అట్టి విషయం దేవునిపల్లి పోలీసులకు తెలియడంతో వెంటనే దేవుని పల్లి పోలీసులు వచ్చి రైతులకు సర్ది చెప్పి ఏదైనా ఉంటే ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడించేంతవరకు ప్రహరీ గోడ నిర్మించనీయకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పడంతో రైతులు అక్కడనుండి వెళ్లిపోయారు, రైతులకు అన్యాయం జరుగుతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని , నిర్మల సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్స్ జీవదన్ కాన్వెంట్ వారు ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని రామేశ్వరపల్లి, తండా ప్రజలు 15 పీట్ల రోడ్డు చూపించిన తర్వాతే పనులు చేయాలని అప్పటివరకు ప్రహరీ గోడ నిర్మించవద్దని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇట్టి విషయం పైన జిల్లా అధికారులు పోలీసులు కూడా రైతులకు అండగా ఉండాలని కోరారు.
