

మన న్యూస్ శంఖవరం (అపురూప్)
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అనుబంధ విభాగాల అధ్యక్షులను ఓ ప్రకటనలో వైయస్సార్సిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యూత్ విభాగం నూతన అధ్యక్షుడిగా శంఖవరం మండల వజ్రకూటం గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సకురు గుర్రాజు మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు ఆశీస్సులతో ప్రోత్సాహంతో నియమకం జరిగిందని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి ముద్రగడ విజయానికి విచ్చేస్తానని సకురు గుర్రాజు తెలిపారు.