

తిరుపతి నవంబర్ 13 మన న్యూస్
*49 వ అంతర్జాతీయ స్థాయి క్వాలిటి కంట్రోల్ సర్కిల్ (ICQCC) పోటీలలో సంస్థ నుంచి పాల్గొన్న 12 టీమ్ లకు, 12 బంగారు అవార్డులు లభించాయి. ఈ పోటీలలో అమర రాజా సంస్థతో పాటు 14 దేశాల నుండి 800 పైగా టీమ్ లు పాల్గొన్నాయి :*
తిరుపతి, 13 నవంబర్ 2024: మంగళవారం కొలంబో, శ్రీలంకలో జరిగిన 49వ అంతర్జాతీయ స్థాయి క్వాలిటి కంట్రోల్ సర్కిల్ (ICQCC) పోటీలలో అమర రాజ సంస్థకు 12 బంగారు పథకాలు సాధించారని సంస్థ యాజమాన్యం మీడియాకు వెల్లడించారు.
లెడ్ యాసిడ్ బ్యాటరీ తయారీ, పవర్ కన్వర్షన్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ సర్వీసెస్ మరియు ఆహార ఉత్పత్తులు లాంటి వివిధ రంగాలలో వ్యాపారాలను విస్తరించిన ఇండియన్ బహుళ జాతి సంస్థ అయిన అమర రాజ నుండి 12 టీమ్ లు ఈ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నాయి.
14 దేశాల నుండి 800 టీమ్ లకు పైగా దాదాపు 5000 మంది సభ్యులు పాల్గొన్న పోటీలలో అమర రాజా సంస్థ తరుపున పాల్గొన్న పన్నెండు 12 టీమ్ లకి 12 బంగారు పథకాలు అవార్డులు సాధించారు.
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షవర్ధన్ గౌరినేని మాట్లాడుతూ మహోన్నత విజయాలనేవి ఎప్పుడు కూడా ఉమ్మడి లక్ష్యం దిశగా కలిసికట్టుగా పనిచేసినప్పుడే వరిస్తాయి. మా బృందాలు దీనిని నిరంతరముగా నిరూపిస్తున్నాయి. ఈ విజయం మేము పాటించే , మా సంస్థ పని సంస్కృతి అయిన ‘The Amara Raja Way’ ® కు నిదర్శనం. మా ఉద్యోగుల సమిష్టి కృషి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఫలితాలను సాధించడానికి , మహోన్నత శిఖరాలను అధిరోహించడానికి మాకు సహాయపడింది. క్వాలిటీ సర్కిల్ బృందంలోని ప్రతి ఒక్కరికి నా అభినందనలు అని అన్నారు.*
*సి నరసింహులు నాయుడు, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ మాట్లాడుతూ “ప్రపంచ వేదికపై అంతర్జాతీయ స్థాయిలో అమర రాజ టీమ్ లు సాధించిన ఈ ప్రతిష్టాత్మకమైన విజయానికి నేను చాలా గర్వపడుతున్నాను. అమర రాజా సంస్థలో మేము పాటిస్తున్న ఖచ్చితమైన, శ్రేష్టమైన, నాణ్యత ప్రమాణాలకు వారి విజయాలు ఒక నిదర్శనం. అందరి సహకారం మరియు సమిష్టి కృషితో నిరంతరం మెరుగైన ఫలితాల సాధన కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటామని తెలిపారు’.*
క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ (QCC) అనేది ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించే ఒక విధానం. దీనిలో పని ప్రదేశంలో ఉన్న ఆపరేటివ్ ఉద్యోగులు టీమ్ లుగా ఏర్పడి సమస్యలను గుర్తించి, కారణాలను విశ్లేషించడం మరియు వాటికి పరిష్కారాలను రూపొందిస్తారు. తద్వారా నాణ్యతా మరియు వ్యాపార ప్రమాణాలలో నిరంతర మెరుగుదలకు సమిష్టిగా కృషి చేస్తారు.
క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ (QCC) సర్కిల్ లతో అమర రాజా సంస్థ తన QCC ప్రయాణాన్ని 2004 సం|| లో ప్రారంభించింది. ఈ రోజు, 8000 మంది ఉద్యోగులు సభ్యులుగా సుమారు 1100 క్వాలిటి సర్కిళ్ల సంస్కృతి అమర రాజా సంస్థ అంతటా విస్తరించింది.
క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ (QCC) సంస్కృతిని అవలంభించడం ప్రోత్సహించడం వలన వ్యాపారంలో తయారీ ఖర్చు తగ్గింపు, నాణ్యత ప్రమాణాలు, డెలివరి, భద్రత, వ్యర్దాలు లేమి మరియు పని వాతావరణంలో ప్రమాణాలు మొదలైన అన్ని అంశాలలోను సంస్థ మెరుగుదల సాధించింది.