

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో పట్టణ టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, ఏలేశ్వరం మండల పరిషత్ గొల్లపల్లి బుజ్జి టిడిపి పార్టీ శ్రేణులతో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు,ఇఫ్తార్ విందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజులపాటు ఎంతో నియమ నిష్ఠలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాసం ఉండి అల్లాహ్ కృపకు పాత్రులవు తారని మరియు క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అనివారు తెలిపారు.ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని,ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం అని బొదిరెడ్డిగోపి పేర్కొన్నారు.మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపు మాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, తెలిపారు. నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ కొంత అనారోగ్యం కారణంగా ఈ ప్రాంగణానికి రాలేకపోయారని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువు షేక్ దిల్బర్ హుస్సేన్,డాక్టర్ విజయబాబు, మాజీ జెడ్పిటిసి జ్యోతుల పెద్దబాబు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వాగు రాజేష్, జోన్నాడ వీరబాబు, కొన్సిలర్లు పెండ్ర శ్రీను,కోణాల రమణ,ఎండగుడి నాగబాబు, పలివెల శ్రీనివాస్, జిగటాపు సూరిబాబు,చిక్కాల లక్ష్మణరావు,బుద్ధ ఈశ్వరరావు,ధనేకుల బద్రరావు, ముస్లిం సోదరులు, టీడీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.