విడవలూరు ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం

మనన్యూస్,కోవూరు:ఫలించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చాణక్యం.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకుల శేషమ్మ.హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు.జై టిడిపి, జై ప్రశాంతమ్మ నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం.ప్రశాంతమ్మకు ధన్యవాదాలు తెలిపిన శేషమ్మ.
విడవలూరు మండల ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికకు సంబంధించి టీడీపీకి చెందిన ఎస్టీ మహిళ ఏకుల శేషమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎంపీపీ ఎన్నికలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చూపిన చాతుర్యం ఫలించింది. దాంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలో, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. విడవలూరు మండల ఎంపీపీ స్థానం ఎస్టి మహిళకు రిజర్వు కావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిన స్థానిక సంస్థలు.. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. గతంలో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా ఎన్నికైనా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వం పక్కదారి పట్టించగా.. ఎక్కడా చిన్న అభివృద్ధి పనులు కూడా జరగలేదు. దాంతో సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో స్థానిక సంస్థలకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగా.. కోవూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సొంత నిధులు వెచ్చించి అనేక గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమలు చేస్తున్నారు. మంచి చేస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెంటే తాము నడుస్తామంటూ ఎంపీపీ శేషము స్పష్టం చేస్తున్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..