

మనన్యూస్,కోవూరు:ఉత్కంఠ భరితంగా ఇనమడుగు ఉపసర్పంచ్ ఎన్నిక.టిడిపి నేతల వ్యూహంతో వైసీపీ విల విల.టిడిపి అభ్యర్థి చేజర్ల మోహన్ విజయం.కోవూరు మండలం ఉపసర్పంచ్ ఎన్నిక హోరాహోరీగా సాగింది. 15 మంది వార్డు సభ్యులున్న ఇనమడుగు పంచాయతీలో వైసీపీకి 9 మంది సభ్యుల బలం వుంది. తెలుగుదేశం పార్టీకి 6 గురు వార్డు సభ్యుల బలం మాత్రమే వుంది. ఉపసర్పంచ్ ఎన్నికను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా సాగిన ఉపసర్పంచ్ పోరులో టిడిపి నేతలు వ్యూహత్మకంగా వ్యవహరించారు. ఇద్దరు వైసీపీ సభ్యులు గైర్హాజరు కావడంతో పాటు మరో వైసీపీ సభ్యుడు టిడిపికి అనుకూలంగా ఓటేయడంతో ఒక్క ఓటు మెజారిటితో టిడిపికి చెందిన చేజర్ల మోహన్ ఉపసర్పంచ్ గా ఎన్నికయ్యారు.
