అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం

Mana News:- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్, 13, 2024 వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక బీ ఆర్ ఎస్ అరాచక శక్తుల కుట్రేనని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశాల రామనాధం అన్నారు. బుధవారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వారి దిగజారిన రాజకీయాలకు అద్దం పడుతుంది అని రామనాధం అన్నారు. రాజకీయాలలో హుందాగా మాట్లాడాలని.. ఆ హుందా తనం మీలో లోపించిందని .. చిల్లర మాటలు మా విధానం కాదని, చెల్లని రూపాయి మాటలు మాట్లాడి, ప్రజల్లో ఇంకా చులకన కావోద్దని హితవు పలికారు. నాడు ఎన్నికల సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వనని ప్రగల్భాలు పలికి.. మీ సీటు నే 35 వేల మెజారిటీ తో చిత్తు చిత్తుగా ఓడిపోయింది మర్చిపోవొద్దు అన్నారు. పది రోజుల్లో మంత్రిని అయ్యి వస్తా అన్నావు.. పత్తా లేకుండా పోయావు.. పదివేల మెజారిటీతో గెలవబోతున్నాము.. కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కండి అని అన్నావు, అదీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు భద్రాచలం లో ఉప ఎన్నిక కు సిద్దం అవుతున్నారు, అధికారం కోసం అర్రులు చాచటం మీకే చెల్లిందన్నరు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని.. గౌరవప్రద రాజకీయాలు చేయాలని సూచించారు. వికారాబాద్ లో బీ ఆర్ ఎస్ ప్రేరేపించిన, వారి అనుచరుల ముసుగులో ఉన్న గూండాలను తక్షణమే అరెస్టు చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశం లో మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుముల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాస రెడ్డి, బండారు సాంబశివరావు, స్వాతంత్ర రెడ్డి, పాయం అప్పారావు, పాడి హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం.
  • సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే రేగా చెల్లని రూపాయి మాటలు.
  • ఎమ్మెల్యే పాయం మీద చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్.
  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!