

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం రాష్ట్రస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025కు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన విద్యార్థి ఎస్.సాయి ప్రదీప్ ఎంపికయ్యారు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్ పార్లమెంటులో సాయి ప్రదీప్ శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తారు. యూత్ పార్లమెంటు-2025లో పాల్గొనే అవకాశం కోసం కోస్తా ఆంధ్ర జిల్లా నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఒక్క నిమిషం వీడియోను మై భారత్ యాప్లో అప్లోడ్ చేశారు. వారిలో స్క్రీనింగ్ ద్వారా 100 మందిని ఎంపిక చేశారు. వీరికి వైజాగ్ గీతం డీమ్డ్ యూనివర్సిటీలో ఈ నెల 24న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. దీనిలో సాయి ప్రదీప్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టాప్ 10లో ఒకరిగా ఎంపికయ్యారు. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ముందు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ అనే అంశంపై సాయి ప్రదీప్ మాట్లాడనున్నారు. సాయి ప్రదీప్ స్పార్క్ సంస్థ లో సీఈఓ గా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇస్రో,డి ఆర్ డి ఓ, నాసా ప్రతినిధిగా చాలా ప్రాజెక్టుల చేశారు ప్రస్తుతం శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ప్రతిభ కనబరిచిన సాయి ప్రదీప్ ను అద్యాపక బృందం,కుటుంబసభ్యులు,ప్రజాప్రతినిధులు అభినందించారు.స్పార్క్ చైర్మన్ సందీప్ మాట్లాడుతూ మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన ప్రదీప్ రాష్ట్రస్థాయి యూత్ పార్లమెంటుకు ఎంపిక అవడం అనేది చాలా గొప్పతనం అని ఇలాంటి అవకాశాన్ని ప్రభుత్వం యువతకు ఇవ్వడం చాలా ఆనందకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం యువతకు ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం అని స్పార్క్ టీమ్ అంతా చాలా ఆనందం వ్యక్తం చేశారు.