మనన్యూస్,శేరిలింగంపల్లి:చందా నగర్ వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందినా ఘటన
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పటల్ లో జరిగింది పూర్తి వివరాలకు వెళ్తే నల్లగొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ (4)తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్ర పురంలో ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం కోనసాగిస్తున్నారు అయితే
చిన్నారి జాన్సన్ కు వాంతులు కావడంతో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయం లో చందానగర్ లోని విష్ణు పారమిత ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగ
బాలుడిని పరిశీలించి మందులు రాసి ఇచ్చిన డ్యూటీ డాక్టర్ మందులు తెచ్చేందుకు బయటకు వెళ్లిన బాలుడి తండ్రి రాజు ఆలోపే డ్యూటీలో ఉన్న నర్సు మరో ఇంజెక్షన్ చేసిన కొద్ది సమయం లోనే
ఇంజెక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని బంధువుల ఆరోపిస్తున్నారు అయితే వైద్యుల నిర్లక్షం వల్ల బాలుడు చనిపోవడం తో బాలుడి కుటుంబ సభ్యులు
హైదరాబాద్, ముంబై నేషనల్ హైవేపై అందోళనా చేపట్టగా
చందానగర్ సీఐ పాలవెల్లి, ఎస్సై ఆంజనేయులు, పోలీసు సిబ్బంది బాలుడి కుటుంబ సభ్యులకు
నచ్చజెప్పి ధర్నాను విరమింప చేసిన చందానగర్ పోలీసులు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందనీ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *