

మనన్యూస్,నారాయణ పేట:విధింపు కోస్గి ఎస్ఐ.బాలరాజు జిల్లా పరిధిలోని కోస్గి టౌన్ బ్రాహ్మణ వీధి కి చెందిన ఏ. వెంకటయ్య అనే వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతుండగా కోస్గి పోలీసుల వాహనాల తనిఖీల్లో డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తే. అట్టి వ్యక్తి మద్యం అధికమోతాదులో తాగిండని అతని పై కేసు నమోదు చేసి ఈ రోజు కోర్టు డ్యూటీ ఆఫీసర్ అంబయ్య గౌడ్, కోస్గి కోర్టులో ప్రవేశపెట్టగా గౌరవ మెజిస్ట్రేట్ ఫర్హీన్ బేగం గారు, ఎ. వెంకటయ్యకు 05 రోజుల జైలు శిక్ష మరియు 2000/- రూపాయల జరిమానా విధించారు. అతనిని రిమాండ్ తరలించడమైనది అని ఎస్ఐ బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు.
