మనన్యూస్,ఆత్మకూరు:దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ.ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది.నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది.విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 60 లక్షలు విలువచేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. వికలాంగుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ.
ఒక్కొక్కరికి రూ. 40వేలు విలువచేసే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ను ఉచితంగా అందజేయడం పట్ల తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన దివ్యాంగులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *