

మనన్యూస్,వనస్థలిపురం:కమ్మ సంఘం మహిళా విభాగం నిర్వాహకులు నంబూరి విజయ శ్రీ చౌదరి,మాదవి చౌదరి ఆధ్వర్యంలో చింతల కుంట సురభి బ్యాంక్వెట్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా శాంతినికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఝాన్సీ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా మహిళలందరికీ సన్మానం,బహుమతులు ప్రధానం జరిగాయి.అనంతరం ఝాన్సీ గారు మాట్లాడుతూ ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.మహిళా అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.మహిళలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే చట్ట సభల్లో తమకు సమూచిత స్థానం ఉండాలని అన్నారు.తనను ఆహ్వానించిన వనస్థలిపురం కమ్మ సంఘం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.తదనంతరం నంబూరి విజయ శ్రీ చౌదరి మాట్లాడుతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని అన్నారు.మహిళలకు ఒక రోజు ఉండడం గర్వించదగ్గ విషయమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు.ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా సమాజం కూడా బాగుంటుందని పేర్కొన్నారు.ఈ వేడుకల్లో భాగంగా సంస్కృతిక కార్యక్రమాలు,గేమ్స్ నిర్వహించుకున్నట్లు తెలిపారు.అనంతరం మాధవి చౌదరి మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే మహిళ పాత్ర కీలకమని అన్నారు. మహిళ అబల కాదు సబల అని తలుచుకుంటే ఏదైనా సాధించగలదని తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఝాన్సీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
