

బంగారుపాళ్యం మార్చ్ 3 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానం నందు ఆదివారం జరిగిన రథోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 43577.00 , సేవా టిక్కెట్లు ద్వారా ఆదాయం 72225.00 , అన్నదానం రశీదు ద్వారా ఆదాయం 20,594.00 రూపాయలు . మొత్తం కలిపి 1,36,396.00 రూపాయలు వచ్చినట్లు ఆలయ వంశపారపర్యం ధర్మకర్త ఎంబి విజయకుమార్, ఆలయ ఈవో మునిరాజులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమములో పాల్గొన్నవారు ఆలయ వంశపారంపర్యం ధర్మకర్త M.B.విజయకుమార్, బ్రహ్మోత్సవాల ఇన్చార్జి యస్.సుమనప్రియ, (చిత్తూరు)ఆలయ ఈవో ఎ.మునిరాజ తనిఖిదారు దేవాదాయశాఖ G.దనంజయనాయుడు, మొగిలి స్థానిక సభ్యులు కె.ప్రసాద్, ఆలయ సిబ్బంది శరవణ, మధు,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.