

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ఈ నెల 27న జరగనున్న మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని డోంగ్లి, పెద్ద కొడప్ గల్ ,పిట్లం, నిజాంసాగర్ మండలల్లో పోలింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న నీటి వసతి, విద్యుత్ సరఫరా, టాయిలెట్స్, ర్యాంప్ సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తహసిల్దార్ బిక్షపతిని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.అనంతరం మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యత మైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని నిర్వాహకులకు సూచించారు.సబ్ కలెక్టర్ వెంట తహిసిల్దార్ లు వేణుగోపాల్ ,దశరథ్,సావాయి సింగ్, బిక్షాపతి,ఎంపీడీవో గంగాధర్, రెవెన్యు ఇన్స్పెక్టర్ సాయి బాబా,అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
