

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీలో వాదే ఓమర్ కాలనీలో ఎండి.జిలాని నేతృత్వంలో జెడ్ మాక్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు యాజమాన్యం ను అభినందించారు.ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడారంగంపై దృష్టి మరల్చడానికి ఇదొక గొప్ప ప్రయత్నమని,క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు.స్థానిక ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అబ్దుల్లా సాధి,మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ యూసుఫ్ పటేల్,ఎండి.అదిబ్ అహ్మద్,ఎండి.సుల్తాన్ అలీ,శంషుద్దీన్,దస్తగిరి,బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంషుద్దీన్, హమీద్ అలీ,మన్సూరి,మిరాజ్ భాయ్,మతిన్ పటేల్,సయ్యద్ జిషన్,మగ్దూం బాయ్,మాహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ,జల్ పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అబ్బాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.