

ఎసిబి రైడ్ పై అధికారులు పూర్తిస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలి
సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్
మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,అశ్వాపురం మండలంలో ఏవో సాయి శాంతన్ పై ఏసీబీ దాడి జరగడం దురదృష్టకరమని,మండల వ్యవసాయ శాఖ అధికారిక రైతుల పక్షపాతిగా 24 గంటల పాటు రైతులకు సేవలు అందిస్తున్న ఏవో సాయి శాంతన్ పై కొందరు కావాలనే కుట్రపూరితంగా పన్నాగంతోనే ఏసీబీ రైడ్ జరిగిందని,మండలంలో మంచి అధికారిని ఎలా అభాసిపాలు చేయడం దురదృష్టకరమైన విషయమని రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సూచనలు సలహాలు చేయడంలో ఏవో సాయి శాంతన్ ముందుండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి రైతుకు అన్ని విషయాలను అర్థమయ్యేలా తెలియపరిచే అధికారి,ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమని,సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ తెలియజేశారు,ఈ ఘటనపై ఏసీబీ పూర్తిగా న్యాయవిచారణ జరపాలని,లేనియెడల అశ్వాపురం మండలం ఉన్న రైతులందరినీ వేదికగా ఏర్పరచుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.