

తవణంపల్లి ఫిబ్రవరి 19 మన న్యూస్
చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి కాణిపాకపట్నం బైపాస్ నందు బుధవారం సాయంత్రం సీఐ సూచనల మేరకు వాహనదారులు ప్రయాణం చేయునప్పుడు అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవించినప్పుడు తలకు బలమైన దెబ్బలు,గాయాలు తగలకుండా ప్రాణహాని జరగకుండా ప్రమాదాలు నివారించేందుకు హెల్మెట్ తప్పక వాడాలని, చిత్తూరు వెస్ట్ సర్కిల్ సీఐ శ్రీధర్ నాయుడు వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారులు హెల్మెట్ తో పాటు లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్స్, వాహనాలకు సంబంధించిన రికార్డులు, తప్పక కలిగి ఉండాలని సూచించారు. అతివేగంగా ప్రయాణించకుండా తమ ప్రాణాలు తమ చేతుల్లోనే ఉన్నాయనే విషయం ప్రతి వాహనదారుడు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి, పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు.