

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి బెంగళూరు కు టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే.ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ నుంచి బెంగళూరు కు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు,కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ టీమ్స్ మణుగూరు లోని రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద తనిఖీలు చేపట్టారు.అనుమానంగా వచ్చినటువంటి టాటా సఫారీ కారును తనిఖీ నిర్వహించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.గంజాయిని తూకం వేయగా 64 కేజీలుగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు.గంజాయి తో పాటు టాటా సఫారీ వాహనాన్ని,ఒక మొబైల్ ఫోన్ను స్వాధీన పరచుకుని,ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు స్వాధీన పరచుకున్న వాటి విలువ కలిపి రూ.19.10 లక్షలు గా ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ కరమ్ చంద్ తెలిపారు.
అరెస్టు కాబడిన వ్యక్తి కేరళ కు చెందిన మహ్మద్ జమీర్ గా ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ఈ తనిఖీల్లో సీఐ రాజిరెడ్డి, ఎస్.ఐ లు గౌతమ్,కిషోర్ బాబు,సిబ్బంది హాబీబ్ పాషా,వెంకట నారాయణ, సుమంత్, ప్రసన్న, శ్రీను, ఆంజనేయులు, పార్థసారథి,రమేష్ పాల్గొన్నారు.గంజాయి పట్టుకున్నటువంటి టీమును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి, ఖమ్మం డివిజన్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, కొత్తగూడెం ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య అభినందించారు.