

వాహనాలు సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తాం…
పినపాక తహసిల్దార్ అద్దంకి నరేష్
మనన్యూస్,పినపాక:మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వాగులు,వంకలు,గోదావరి ల నుండి ఇసుకను తోలితే కఠిన చర్యలు తీసుకుంటామని పినపాక తహసిల్దార్ నరేష్ హెచ్చరించారు.మండలంలో కొందరు ఇసుకను అక్రమంగా తోలుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్ లో రెవిన్యూ,పోలీసుల ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ పెట్టినట్లు తాసిల్దార్ తెలిపారు.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఇసుకతోలకాలు చేపడితే వాహనాలను సిజ్చేస్తామని జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ప్రతి ఇసుక ర్యాంపులలో సీక్రెట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపినారు.రెవెన్యూ, పోలీస్ సిబ్బంది 24/7 తనిఖీలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు